తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘తండేల్’ (Thandel Movie). ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా, అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాపై అంచనాలు పెంచేలా ఫిబ్రవరి 1న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. ఈ ఈవెంట్ రేపు హైదరాబాద్‌లో సాయంత్రం 5 గంటలకు గ్రాండ్‌గా జరగనుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్‌కు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో, సినిమా మీద హైప్ మరింత పెరిగింది.