టీడీపీ-జనసేన ఆశలకు గండి కొట్టిన జగన్

టీడీపీ-జనసేన ఆశలకు గండి కొట్టిన జగన్

Summarize with AI

విజయవాడ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించిన మేయర్ అభ్యర్థుల ఎంపికపై తెరపడింది. జనరల్ స్థానంగా కేటాయించిన విజయవాడ మేయర్ పీఠానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మరోసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించిన టీడీపీ.. వంగవీటి రాధాకృష్ణను బరిలో నిలిపింది.

ఈ ఎన్నికల్లో వంగవీటి రాధాకు పోటీగా దేవినేని అవినాష్‌ను వైసీపీ బరిలో నిలపనుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఒకవేళ అవినాష్‌ను రంగంలోకి దించితే, కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఉసిగొల్పుతున్నారంటూ దుష్ప్రచారం చేసి, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీని కాపుల దృష్టిలో విలన్‌గా చూపాలని కూటమి పార్టీలు పక్కా వ్యూహం రచించాయి.

ఈ రాజకీయ కుట్రను ముందే పసిగట్టిన వైఎస్ జగన్.. ఆ పార్టీల ఆశలపై నీళ్లు చల్లుతూ ఎంతో వ్యూహాత్మకంగా బీసీ మహిళా నేత రాయన భాగ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

గత ఐదేళ్ల పాటు విజయవాడ నగరంలో మెరుగైన సేవలు అందించి, నగరంలో బలమైన పట్టున్న సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మిని బరిలో దించడం ద్వారా వైసీపీ మాస్టర్ స్ట్రాటజీ వేసింది. దీంతో ఇప్పుడు విజయవాడ మేయర్ పోరు వంగవీటి రాధా వర్సెస్ బీసీ మహిళా నేత అన్నట్లుగా మారనుంది.

మరోవైపు, వంగవీటి రాధాను మేయర్ అభ్యర్థిగా తెరపైకి తేవడాన్ని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఆ వర్గ నేతలు అర్ధరాత్రులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

ఇప్పుడు రాధాకు దీటుగా బలమైన బీసీ మహిళా నేత బరిలో నిలవడం, మరోవైపు తమ వర్గానికి మేయర్ సీటు దక్కకపోవడంతో చంద్రబాబు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ వేసిన ఈ ఒక్క ఎత్తుగడతో కూటమి వ్యూహాలన్నీ తలకిందులయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment