సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) మరియు విక్టరీ వెంకటేష్(Venkatesh) ప్రధాన పాత్రల్లో నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (SVSC Re-release) మరోసారి థియేటర్లలో సందడి చేయనుందా? ఈ సినిమా విడుదలై ఇప్పటికే 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ రీ-రిలీజ్ చేసే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం.
ఇంతలో హీరోయిన్ అంజలి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “ఈ సినిమాను ఫిబ్రవరిలో తిరిగి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు(Dil Raju)ను కోరాను” అని చెప్పడం రీరిలీజ్పై మరింత ఆసక్తిని పెంచింది. అయితే, అధికారిక రీ-రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.
ఈమూవీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేశ్-వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ, కుటుంబ విలువలు, సంగీతం—ఇవి సినిమాను ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచేలా చేశాయి. మరి, రీ-రిలీజ్ డేట్ త్వరలో అధికారికంగా అనౌన్స్ అవుతుందా? వేచి చూడాలి!