గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మకంగా జరగబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. 2027లో జూలై 23 నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాల‌ని నిర్ణయించారు. ఈసారి పుష్కరాల నిర్వహణలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది ప్ర‌భుత్వం

2015లో జ‌రిగిన గోదావ‌రి పుష్క‌రాల్లో రాజ‌మండ్రి వ‌ద్ద 29 మంది చ‌నిపోయారు. సీఎం హోదాలో చంద్ర‌బాబు కుటుంబం పుణ్య‌స్నానాలు ఆచ‌రించేందుకు రావ‌డంతో భ‌క్తులను నిలిపివేయ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగి 29 మంది చ‌నిపోయారు. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం- చంద్ర‌బాబు షూటింగ్ కార‌ణంగానే భ‌క్తులు మృతిచెందార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

మునుపటి జ్ఞానాలను దృష్టిలో ఉంచుకొని పుష్కరాల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల ప్రారంభం సమయంలో ఏర్పడిన అనుకోని ఘటనలు ఇప్ప‌టికీ వెంటాడుతుండ‌టంతో ఈసారి భక్తుల సౌకర్యం కోసం కొత్త మార్గాలను తీసుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా, గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేసేందుకు భక్తులకు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు సమాచారం.

భక్తుల వసతికి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను మెరుగుపర్చడానికి రూ.271.43 కోట్లు కేటాయించడమే కాకుండా, ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లు నడిపించే నిర్ణయం తీసుకుంది. ఈ పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం రూ.904 కోట్లతో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment