రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రేవంత్ స‌ర్కార్‌పై కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Summarize with AI

తెలంగాణ‌లో మోసకారి కాంగ్రెస్ సర్కారుపై ప్రజాతిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయ్యిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ‌సభ‌ల్లో ప్ర‌భుత్వం ఉన్న వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు.

కేటీఆర్ త‌న ట్వీట్‌లో.. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైంది. ఇక కాలయాపనతో కాలం సాగదు, అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు. ఈ దరఖాస్తుల దందా నడవదు, ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు. నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు
అట్టుడికిన గ్రామసభల సాక్షిగా, గ్రామసభలా…ఖాకీల క్యాంప్ లా!? సంక్షేమ పథకాల కోసమా..కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు జ‌రుగుతున్నాయ‌ని, పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా? అని నిల‌దీశారు. ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా? ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా? పోలీసుల నడుమ.. అంక్షల నడుమ..పథకాలకు అర్హుల గుర్తింపట! నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన! సాగుతోంద‌ని కేటీఆర్ సెటైర్లు వేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment