ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

ఏటీఎం వాహ‌నంపై కాల్పులు.. రూ.93 ల‌క్ష‌ల నగదు చోరీ

Summarize with AI

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ దొంగలు, పట్టపగలే ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వెళ్తున్న వాహనాన్ని అడ్డుకుని భయంకరమైన దాడి చేశారు. వాహనంలోని సెక్యూరిటీ సిబ్బందిపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపి, ఇద్దరిని అక్కడికక్కడే చంపారు. మరో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు.

క్యాష్ బాక్స్‌తో పరారైన దుండగులు
కాల్పుల తర్వాత దోపిడీ దొంగలు నగదు పెట్టెను బైక్‌పై తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ప్రాథమికంగా ఆ బాక్స్‌లో దాదాపు రూ.93 ల‌క్ష‌ల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, దోపిడీ దొంగల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

పోలీసుల చర్యలు
దోపిడీ ఘటన జరిగిన తర్వాత పోలీసులు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి వెతుకులాట జరుపుతున్నారు. అయితే, దుండగులు ఎటువైపు పారిపోయారనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment