Costly Divorce: హృతిక్ రోషన్ భార్యకు చెల్లించిన భరణం ఎంతంటే

Costly Divorce: హృతిక్ రోషన్ భార్యకు చెల్లించిన భరణం ఎంతంటే

సినిమా పరిశ్రమలో విడాకుల సంస్కృతి ఒక సాధారణ విషయం అయిపోయింది. కానీ, కొన్ని సందర్భాల్లో విడాకులు మరింత చర్చనీయాంశం అవుతాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో విడిపోయిన జంటలు చాలానే ఉన్నా, ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో మీరు తెలుసా?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరియు ఆయన మాజీ భార్య సుస్సానే ఖాన్ మధ్య జరిగిన విడాకులు అత్యంత ఖ‌రీదైన‌విగా తెలుస్తోంది. వారు పెళ్లి అయిన 14 సంవత్సరాల తర్వాత విడిపోయారు, అయితే ఆ విడాకుల నేప‌థ్యంలో సుస్సానే హృతిక్ నుండి భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసింది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ క‌థ‌నం ప్రకారం, ఈ విడాకులు ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైనవి, ఎందుకంటే హృతిక్ సుస్సానేతో విడిపోవడానికి రూ. 380 కోట్ల భరణం చెల్లించాడు.

ఈ డివోర్స్ తర్వాత హృతిక్, సుస్సానే ఇద్దరూ తమ పిల్లల కోసం తరచూ కలుస్తున్నారు. అయితే, సుస్సానే ప్రస్తుతం అలీ గోనీ సోదరుడు అర్సలాన్ గోనితో డేటింగ్ చేస్తుంది, మరోవైపు హృతిక్ సింగర్ సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ విడాకుల తర్వాత మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు, ఇంకా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో చేయడం, బర్త్ డే విషెస్ చెప్తూ కాపాడుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment