మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంట్లో జరిగిన ఇన్‌కం ట్యాక్స్ (ఐటీ) దాడులు సంచలనం రేపాయి. ఈ దాడుల్లో పలు షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఐటీ అధికారులు రూ.3 కోట్ల నగదు, భారీగా నగలు, బినామీ ఆస్తులను సీజ్ చేశారు. అయితే, దీనితో పాటు అత్యంత ఆశ్చర్యకర విషయాన్ని గమనించి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. మాజీ ఎమ్మెల్యే హర్వంశ్ సింగ్ రాథోడ్ ఇంటి ఆవరణలోని బావిలో మూడు మొసళ్లు కూడా లభ్యమయ్యాయి. ఈ అంశం అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటన భోపాల్‌లో హాట్‌టాపిక్‌గా మారింది
ఈ సోదాల్లో 14 కిలోల బంగారం, దాదాపు రూ.3.8 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు పలు లగ్జరీ వాహనాలను సీజ్ చేశారు. దాదాపు రూ.150 కోట్ల వరకు లెక్కలు చూపని లావాదేవీలను కూడా అధికారులు బయటపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దాడిని ఆదాయపు పన్ను శాఖ ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి నిర్వహించింది.