హైదరాబాద్‌లోని (Hyderabad) కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (Kukatpally Housing Board – KPHB) పోలీస్ స్టేషన్ (Police Station)పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో (Addagutta Western Hills) నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు (Sai Venkata Sindhu) కార్తీక దీపం అంటుకుని తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటిక్ (SS Boutique) నిర్వహిస్తున్న సింధు.. ఈ నెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి గేటు వద్ద ప్రమాదానికి గురైంది. గేటు దగ్గర వెలిగించిన కార్తీక దీపం (Karthika Deepam) ఆమె చీరకు అంటుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింధును కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. చేతికి అందివచ్చిన వయసులో యువతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సింధు మరణవార్తతో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్(Addagutta Western Hills) ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.








