నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక వేదికగా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంలో జనసేనకు టీడీపీ నుంచి సహకారం కరవైంది. పొత్తులో భాగంగా నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవిని జనసేనకు కేటాయించినట్లు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ పదవికి జనసేన అభ్యర్థిగా అద్దేపల్లి సౌజన్య పేరును ప్రకటించినప్పటికీ టీడీపీ సభ్యులు మద్దతు ఇవ్వలేదు.
వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి వరుసగా రెండో రోజు కూడా టీడీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. జనసేన తరఫున ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. టీడీపీ సభ్యులు హాజరుకాకపోవడంతో కోరం లభించలేదు. దీంతో ఎన్నికను అధికారులు మరోసారి వాయిదా వేశారు.
కూటమి పార్టీల మధ్య కుదిరిన పదవుల పంపకానికి అనుగుణంగా పవన్ కల్యాణ్ స్వయంగా అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో టీడీపీ కౌన్సిలర్లు సహకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండుసార్లు ఎన్నిక వాయిదా పడటంతో నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పదవి వ్యవహారం కూటమిలో విభేదాలకు దారితీసింది.
జనసేనకు స్పీకర్ అయ్యన్న ఝలక్నర్సీపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో రెండవ రోజు కూడా జనసేనకు సహకరించని టిడిపివైస్ చైర్మన్ పదవి జనసేనకే అంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్అద్దేపల్లి సౌజన్య పేరు వైస్ చైర్మన్ గా ప్రకటనవైస్ చైర్మన్ ఎన్నికకు జనసేన తరపున ముగ్గురు కౌన్సిలర్లు.. టిడిపి కౌన్సిలర్లు గైర్హాజరుటిడిపి సహకరించకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసిన అధికారులు.
— Telugu Feed (@Telugufeedsite) November 24, 2026








