తిరుపతిలో ప్రముఖ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంట్లో మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెల 27న తిరుపతిలోని పీకే లేఅవుట్లో ఓ మహిళ మృతి చెందిందని, అది ఆత్మహత్య కాదని, హత్య అని వ్యాఖ్యానించారు. మహిళ మృతి చెందిన ఇల్లు ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడికి చెందినదని పేర్కొన్నారు. గుర్తుతెలియని మహిళ ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంటికి వెళ్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నించారు.
సదరు జిల్లా అధ్యక్షుడికి, మృతి చెందిన మహిళకు వివాహేతర సంబంధం ఉందని, వారి మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే ఆమెను హత్య చేశారని భూమన అన్నారు. అయితే పోలీసులు గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు కేసును ముగించారని, వెంటనే దహన సంస్కారాలు కూడా నిర్వహించారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిని కూటమి ప్రభుత్వం, పోలీసులు కాపాడారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంలోని నిజాలను బయటపెట్టి, సదరు జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు.
మహిళ మృతి వ్యవహారంపై ఓ మహిళా మానవ హక్కుల ప్రతినిధి పోరాటం చేస్తున్నారని భూమన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులతో సదరు ప్రతినిధి జరిపిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారినట్లు పేర్కొన్నారు. మహిళ మృతి వెనుక ఉన్న వాస్తవాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరాన్ని ఆయన వ్యాఖ్యలు తెరపైకి తెచ్చాయి.
ప్రముఖ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంట్లో మహిళ మృతితిరుపతిలో గత నెల 27న శ్రీనివాసం ఎదురుగా ఉన్న లక్ష్మీ నిలయం అనే ఇంట్లో ఓ మహిళ మృతిచెందిందిఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి, ఆ మహిళకు ఉన్న అక్రమ సంబంధం గొడవల కారణంగానే హత్య చేశారుమహిళ చనిపోతే పోలీసులు గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యగా కేసు కట్టారు. రాజకీయ నాయకుడి ఒత్తిడితో పోలీసులు ఎవరినీ విచారించకుండానే మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలుపోలీసులు ఇప్పుడు నిజాలు దాచినా.. మా ప్రభుత్వం రాగానే ఆ మహిళను హత్య చేసిన పార్టీ అధ్యక్షుడు కటకటాల పాలవ్వడం ఖాయం– భూమన కరుణాకర్‌రెడ్డి
— Telugu Feed (@Telugufeedsite) November 24, 2026







