రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి!

రామ్ చరణ్‌కు జోడీగా సాత్విక వీరవల్లి!

Summarize with AI

‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప 2’ విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కథలో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. సుకుమార్ తన సినిమాల్లో కథానాయికలకు ప్రాధాన్యత ఇస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో RC17లో హీరోయిన్ ఎంపికపై మేకర్స్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత సారా అర్జున్ పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం మరో నటిని ఎంపిక చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్.

తాజా సమాచారం ప్రకారం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లి పేరు రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సుకుమార్ బృందాన్ని ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో ఆమెకు లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ నిర్వహించనున్నారని సమాచారం. అయితే హీరోయిన్ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment