వెల్లింగ్టన్లోని(Wellington) బేసిన్ రిజర్వ్(Basin Reserve) వేదికగా భారత్(India), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో(1st Test) టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్(KL Rahul) అదరగొట్టారు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈ జోడీ అద్భుతమైన ఆరంభాన్ని అందించింది. ఆచితూచి ఆడుతూ క్రీజులో కుదురుకున్న ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో భారత ఓపెనింగ్ జోడీ 32 ఏళ్ల తర్వాత సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 1994లో హామిల్టన్ టెస్ట్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, నయన్ మోంగియా తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు.
న్యూజిలాండ్‌లో భారత ఓపెనర్ల అత్యధిక భాగస్వామ్యం(Highest Opening Partnership) రికార్డు మాత్రం మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్ పేరిట ఉంది. 1990లో ఆక్లాండ్ టెస్ట్‌లో(Auckland Test) వీరిద్దరూ అజేయంగా 149 పరుగులు జోడించారు. ఇక 1981లో క్రైస్ట్‌చర్చ్ టెస్ట్‌లో చేతన్ చౌహాన్(Chetan Chauhan), సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) 114 పరుగుల భాగస్వామ్యంతో మరో రికార్డు సృష్టించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం వినూ మన్కడ్, పంకజ్ రాయ్ పేరిట ఉంది. 1956లో చెన్నై టెస్ట్‌లో వీరిద్దరూ ఏకంగా 413 పరుగులు జోడించారు. మరోవైపు న్యూజిలాండ్ గడ్డపై ఏ వికెట్‌కైనా భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యం 1976లో ఆక్లాండ్ టెస్ట్‌లో సునీల్ గవాస్కర్, సురీందర్ అమర్నాథ్ నమోదు చేసిన 204 పరుగులు కావడం విశేషం.








