పంచాయతీ పోరులోనూ టీడీపీ దౌర్జ‌న్యాలు.. క‌డ‌ప‌లో మ‌రీ దారుణం

పంచాయతీ పోరులోనూ టీడీపీ దౌర్జ‌న్యాలు.. క‌డ‌ప‌లో మ‌రీ దారుణం

Summarize with AI

పంచాయతీ ఎన్నికల నామినేషన్ల (Panchayat Elections Nominations) సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా క‌డ‌ప (Kadapa) జిల్లాలో అధికార పార్టీ శ్రేణుల ఆగ‌డాలు మితిమీరిపోయాయి. కడప జిల్లాలో వేంపల్లిలో(Vempalli) క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. టీడీపీ (TDP) దౌర్జ‌న్యాల వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వైసీపీ(YSRCP)బ‌ల‌ప‌రిచిన స‌ర్పంచ్ అభ్య‌ర్థుల (Sarpanch Candidates) ఇళ్ల‌పై రాళ్ల దాడులు, పెట్రోల్ బాంబుల‌తో(Petrol Bombs) దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. పులివెందుల‌లో(Pulivendula) వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (YS Avinash Reddy) ఇంటి వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రింప‌జేసి బ‌య‌ట‌కు వెళ్ల‌నీయ‌కుండా క‌ట్ట‌డికి ప్ర‌య‌త్నించారు. వేంప‌ల్లిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి (Satish Reddy) ఇంటి నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరారు.

అయితే బిడాల మిట్ట రోడ్డు వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ సతీష్ రెడ్డి సోదరుడు, మాజీ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. నామినేషన్ దాఖలు (Nomination Filing) చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి.

మరోవైపు వేముల క్లస్టర్ పరిధిలోని వేముల, పెండ్లూరు, వి.కొత్తపల్లి, గొందిపల్లి, మబ్బు చింతలపల్లె ప్రాంతాలకు చెందిన వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బయలుదేరగా పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ (Murali Naik) వారిని అడ్డుకున్నారు.

వేముల మండలం కొండారెడ్డిపల్లిలో నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ శ్రేణులపై రాళ్లదాడి జరగడంతో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వేముల నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన దాడిలో మాలిక్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ఇక చక్రాయపేట మండలంలోనూ నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గ్రామాల్లో దుకాణాలను మూసివేయించడంతో పాటు నాగులగుట్టపల్లెలో నామినేషన్ల ప్రక్రియకు వెళ్లకుండా వైసీపీ సానుభూతిపరులను అడ్డుకున్నారు.

సురభి గ్రామంలోనూ టీడీపీ(TDP) శ్రేణుల హల్‌చల్‌తో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, మద్దతుదారులకు ఎదురైన అడ్డంకులు, పలు ప్రాంతాల్లో జరిగిన దాడులతో కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయ వేడిని పెంచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment