పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(West Central Bay of Bengal) కొనసాగుతున్న తీవ్ర తుపాన్ అక్వాన్ (Aqwan) మళ్లీ తన దిశను మార్చుకుంది. ప్రస్తుతం ఒడిశా–ఉత్తరాంధ్ర తీరం వైపు పయనిస్తోంది. విశాఖపట్నానికి(Visakhapatnam) 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన అక్వాన్ రేపటికి అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుంది. యాంటీ సైక్లోన్ వ్యవస్థల ప్రభావంతో తుపాన్ గమనంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న అక్వాన్ తుపాన్ ఒడిశాలోని పూరీ–విశాఖపట్నం మధ్య తీరం దాటే (Landfall) అవకాశం ఉంది. తీరానికి చేరువయ్యే కొద్దీ తుపాన్ బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ గాలుల తీవ్రత కొనసాగనుంది. అక్వాన్ ప్రభావంతో ఈ రోజు సాయంత్రం నుంచి శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.








