మోడీని ‘టఫ్ మ్యాన్’ అంటూ ప్రశంసించిన ట్రంప్..

మోడీని ‘టఫ్ మ్యాన్’ అంటూ ప్రశంసించిన ట్రంప్..

Summarize with AI

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో(Manila) జరిగిన క్వాడ్ (QUAD) నేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), భారత ప్రధాని నరేంద్ర మోడీపై(Narendra Modi) ప్రశంసలు కురిపించారు. ఆసియాన్ 2026 సమ్మిట్‌లో(ASEAN 2026 Summit) భాగంగా జరిగిన ఈ భేటీలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోడీని ఉద్దేశించి ట్రంప్ ‘టఫ్ మ్యాన్’(Tough Man) అంటూ అభివర్ణించారు. మోడీ తనకు మంచి మిత్రుడని(Good Friend), సమర్థవంతమైన నాయకుడని కొనియాడారు. అనంతరం జపాన్ ప్రధాని సనాయే తకైచిని (Sanae Takaichi) ప్రస్తావిస్తూ ఆమె కూడా మరింత కఠినమైన నాయకురాలు కావచ్చని వ్యాఖ్యానించారు. ఇండో-పసిఫిక్ (Indo-Pacific Region)ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంతో పాటు సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడంపై నేతలు చర్చించారు.

మరోవైపు, అరుదైన ఖనిజాల ఉత్పత్తిని పెంచేందుకు క్వాడ్ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఈ రంగంలో అమెరికా(USA), భారత్(India), జపాన్(Japan) చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. రాబోయే పది నెలల్లో అమెరికాకు అవసరమైన అరుదైన ఖనిజాలు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇతర దేశాలు కూడా ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. కీలక ఖనిజాల సరఫరా విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు, ఉత్పత్తి మరియు సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడంపై క్వాడ్ దేశాల మధ్య సహకారం ప్రాధాన్యత సంతరించుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment