యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘బబ్లూ XXL’ (Bablu XXL) నుంచి దీపావళి (Diwali) కానుకగా మ్యాజికల్ ఫస్ట్ స్పార్క్ విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు పుష్కూర్ రామ్ మోహన్ రావు(Pushkur Ram Mohan Rao), భరత్ ఎన్. నారంగ్ (Bharath N. Narang) నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిలు కంపాటి (Sailu Kampati) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై (Sri Venkateswara Cinemas సోనాలి నారంగ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జెన్ జెడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ స్పార్క్‌లో హీరో బబ్లూ ప్రేమకథను వినోదాత్మకంగా పరిచయం చేశారు. తొలిచూపులోనే ప్రేమ పుట్టే క్షణంలోని అందమైన భావోద్వేగాలను ఆకట్టుకునేలా చూపించారు. ఈ గ్లింప్స్ ద్వారా గహజీ ఎస్కేను (Gahaji SK) కథానాయికగా పరిచయం చేశారు. సుమంత్ ప్రభాస్, గహజీ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సాయిపల్లవి (Sai Pallavi) వీరాభిమానిగా కనిపించనున్నారు. తన సహజమైన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ విజయంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సాయిలు కంపాటి (Sailu Kampati) ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మంచిర్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) సంగీతం అందిస్తుండగా, వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎల్లపు ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆయేషా మరియం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. జానీ, జేడీ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘బబ్లూ XXL’ చిత్రాన్ని 2027 ప్రారంభంలో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించగా, తాజాగా వచ్చిన ఫస్ట్ స్పార్క్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.








