బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడనున్న అల్పపీడనం (Low Pressure Area) తెలంగాణ రాష్ట్రంలోనూ (Telangana State)వాతావరణ మార్పులకు కారణమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ బలపడితే తుఫానుగా (Cyclone) మారే అవకాశాలు కూడా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే అల్పపీడనం ఏ దిశగా కదులుతుంది, ఎంత తీవ్రతకు చేరుకుంటుందనే దానిపై రాబోయే 24 గంటలు కీలకం కానున్నాయి. ప్రస్తుతం గాలుల దిశ ఒడిశా(Odisha), పశ్చిమ బెంగాల్ (West Bengal) వైపు ఉండటంతో తెలంగాణపై ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై వాతావరణ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
అల్పపీడనం గమనం, గాలుల దిశలో వచ్చే మార్పులను బట్టి తెలంగాణలో వర్షాల పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందా అనే అంశంపై తాజా అంచనాలు వెలువడాల్సి ఉంది. రైతులు(Farmers) పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంపై స్పష్టత వచ్చిన తర్వాత తెలంగాణలో జిల్లాల వారీగా వర్ష సూచనలు వెల్లడయ్యే అవకాశం ఉంది.








