ఏపీలో MPP, ZPP పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్.. తేదీలు ఖరారు

ఏపీలో MPP, ZPP పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్.. తేదీలు ఖరారు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికలు ముగియడంతో మండల, జిల్లా పరిషత్‌ల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజా పరిషత్‌ (MPP)లు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ (ZPP)ల్లో కో-ఆప్టెడ్ సభ్యులతో పాటు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 19, 2026న MPP ఎన్నికలు, నవంబర్ 20న ZPP ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ప్రతి MPPలో ఒకరు, ZPPలో ఇద్దరు చొప్పున కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకున్న తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ పరోక్ష ఎన్నికలు చేతులెత్తే విధానంలో జరగనున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో రాజకీయ పార్టీల విప్ వర్తించనుండగా, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా సమావేశాలకు హాజరుకావచ్చు కానీ ఓటు హక్కు ఉండదు. ఎన్నికైన MPTC, ZPTC సభ్యులే ఓటు వేయనున్నారు. ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన నోటీసులను నవంబర్ 14లోపు సభ్యులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌లలో కీలక పదవుల ఎన్నికలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment