అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి సందడి.. గ్రీస్‌కు క్యూ కడుతున్న ప్రముఖులు!

అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి సందడి.. గ్రీస్‌కు క్యూ కడుతున్న ప్రముఖులు!

Summarize with AI

కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సీఈఓ(CEO) కావ్య మారన్‌ల (Kavya Maran) వివాహ వేడుకలు గ్రీస్‌లో(Greece) ఘనంగా జరగనున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth), తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin), ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కుటుంబ సమేతంగా గ్రీస్‌కు బయలుదేరారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో(Chennai Airport) వీరు ప్రయాణానికి సిద్ధమవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రజినీకాంత్‌తో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) కూడా గ్రీస్‌కు వెళ్లారు. అనిరుధ్ రజినీకాంత్‌కు స్వయానా మేనల్లుడు కావడంతో ఈ పెళ్లికి ఆయన హాజరవుతున్నారు. కుటుంబ బంధంతో పాటు అనిరుధ్, రజినీకాంత్ కలిసి ‘పేట’, ‘దర్బార్’, ‘జెయిలర్’, ‘వేట్టయాన్’, ‘జెయిలర్ 2’ వంటి సినిమాలకు పనిచేశారు. ముఖ్యంగా ‘జెయిలర్’లోని ‘హుకుం’ పాటకు విశేష ఆదరణ లభించింది.

మరోవైపు కావ్య మారన్‌కు (Kavya Maran) కూడా స్టాలిన్ కుటుంబంతో బంధుత్వం ఉంది. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల కుమార్తె అయిన కావ్యకు.. మారన్, కరుణానిధి కుటుంబాల మధ్య ఉన్న బంధుత్వం కారణంగా ఎంకే స్టాలిన్ మామయ్య వరుస అవుతారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా, సన్ టీవీ నెట్‌వర్క్‌లో(Sun TV Network) కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కావ్యకు క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఈ వివాహ వేడుకలు అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో ప్రైవేట్‌గా జరగనున్నాయి. అతిథుల ప్రయాణం, వసతి ఏర్పాట్లను మారన్ కుటుంబం పర్యవేక్షిస్తోంది. కాగా, చెన్నైలో నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎంకే స్టాలిన్ షేర్ చేయగా, కళానిధి మారన్ దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని(Revanth Reddy) కూడా స్వయంగా ఆహ్వానించారు. తమిళనాడు సీఎం విజయ్(Vijay), అజిత్ కుమార్(Ajith Kumar) తదితర ప్రముఖులు ఈ రిసెప్షన్‌కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment