అనిరుధ్ పెళ్లి సందడి.. గ్రీస్‌కు తరలివెళ్తున్న ప్రముఖులు!

అనిరుధ్ పెళ్లి సందడి.. గ్రీస్‌కు తరలివెళ్తున్న ప్రముఖులు!

Summarize with AI

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సీఈవో(CEO) కావ్య మారన్ (Kavya Maran) వివాహ వేడుకలకు గ్రీస్ (Greece) వేదిక కానుంది. ఈ నెల 10, 11 తేదీల్లో వివాహ వేడుకలు (Wedding Celebrations) జరగనున్న నేపథ్యంలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీస్‌కు బయల్దేరుతున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin), మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) తమ కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకలకు పయనమయ్యారు. చెన్నై విమానాశ్రయంలో(Chennai Airport) వీరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అనిరుధ్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌తో(Aishwarya Rajinikanth) కలిసి గ్రీస్‌కు బయల్దేరారు. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర, రజినీకాంత్ భార్య లత సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. దీంతో అనిరుధ్‌కు రజినీకాంత్ మేనమామ వరుస అవుతారు. వీరిద్దరి మధ్య కుటుంబ బంధంతో పాటు సినీ అనుబంధం కూడా ఉంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్(MK Stalin), ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి వివాహ వేడుకలకు బయల్దేరారు. సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు చెన్నై నుంచి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్‌కు పయనమయ్యారు. అక్కడి నుంచి గ్రీస్‌కు చేరుకోనున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం నవంబర్ 13న తిరిగి చెన్నై చేరుకునే అవకాశం ఉంది. కావ్య మారన్ (Kavya Maran) కుటుంబంతో స్టాలిన్‌కు సన్నిహిత బంధుత్వం ఉంది.

గ్రీస్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌లో(ITC Grand Chola Hotel) భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్(CM Vijay), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

అనిరుధ్ రవిచందర్ దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు కావ్య మారన్ సన్ గ్రూప్ (Sun Group) అధినేత కళానిధి మారన్ (Kalanithi Maran) కుమార్తెగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరిద్దరి వివాహం సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment