ట్రెండింగ్‌లో ‘రామాయణ’ టాప్ ప్లేస్.. రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!

ట్రెండింగ్‌లో ‘రామాయణ’ టాప్ ప్లేస్.. రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!

Summarize with AI

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. బుక్‌మైషోలో అత్యధిక పీక్ అవర్ ట్రెండింగ్ ఆసక్తిని నమోదు చేసిన చిత్రంగా 1,11,830 ట్రెండింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ‘ధురంధర్ 2’, ‘పుష్ప 2’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే రూ.499.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. భారత్‌లో రూ.238.85 కోట్ల నెట్, రూ.285.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్‌లో రూ.214 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment