బూతులతో రెచ్చిపోయిన మంత్రి ఆనం.. వీడియో బయటపెట్టిన వైసీపీ!

బూతులతో రెచ్చిపోయిన మంత్రి ఆనం.. వీడియో బయటపెట్టిన వైసీపీ!

Summarize with AI

నెల్లూరు జిల్లా అనంతసాగరంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) పోలింగ్ కేంద్రం (Polling Booth) వద్ద హల్‌చల్ చేశారు. పోలింగ్ బూత్ సమీపంలో జడ్పీటీసీ అభ్యర్థి (ZPTC Candidate) భర్తపై బూతులతో (Abusive Language) విరుచుకుపడ్డారు. నిన్న హంగామా సృష్టించి నేడు మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీ(YSRCP) మాజీ ఎమ్మెల్యే మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిపై (Mekapati Vikram Reddy) ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మంత్రి ఆనం వ్యవహారానికి సంబంధించిన వీడియోను వైసీపీ బయటపెట్టింది. ఈ వీడియోతో పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.

అనంతసాగరం (Ananthasagaram) పోలింగ్ కేంద్రానికి (Polling Station) దూరంగా ఉన్న జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి భర్త వద్దకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెళ్లారు. ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బూతులతో రెచ్చిపోయారు. అక్కడితో ఆగకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. మంత్రి తీరుతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలింగ్ బూత్‌లోకి(Polling Booth) ప్రవేశించేందుకు మంత్రి ఆనం ప్రయత్నించగా అక్కడున్న వైసీపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు మంత్రి ప్రయత్నించారని, తమ పార్టీ ఏజెంట్లు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని వైసీపీ వెల్లడించింది.

పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన ఘటనను మంత్రి ఆనం పూర్తిగా వక్రీకరించారని వైసీపీ మండిపడింది. తన వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు మేకపాటి విక్రమ్‌రెడ్డిని దూషిస్తూ ఆయనపై నిందలు వేశారని విమర్శించింది.

పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి ఆనం వ్యవహరించిన తీరును ప్రజల ముందుంచుతూ వైసీపీ విడుదల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రి దేవాదాయ శాఖ మంత్రి ఏం స‌మాధానం చెబుతారో వేచి చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment