ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), సంక్షేమ వసతి గృహాల్లో(Welfare Hostels) విద్యార్థుల భవిష్యత్తును (Students’ Future) తీర్చిదిద్దే దేవాలయాలుగా కాకుండా, కూటమి పాలనలో(Coalition Government) విద్యార్థుల ప్రాణాలను బలితీసుకునే డెత్ ట్రాప్‌లుగా(Death Traps) మారిపోతున్నాయా..? కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ (Nara Lokesh) తన శాఖపై కనీస శ్రద్ధ చూపడం లేదా..? విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా గాలికి వదిలేశారా..? ఏపీలోని సర్కారీ స్కూళ్లలో జరుగుతున్న దారుణాలతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎలక్ట్రిక్ రంపంతో(Electric Saw) విద్యార్థులపై దాడి చేయడం, స్కూల్ గోడ కూలి విద్యార్థులు చనిపోవడం, కలుషిత నీరు తాగి విద్యార్థుల మరణించడం ఇలా వరుసగా దారుణ ఘటనలు రోజుకో చోట వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మన్యం జిల్లా కురుపాం ఏపీ గురుకుల రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో(Kurupam AP Residential Girls’ School) ఏకంగా 44 మంది విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు గురైన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గురువారం కురుపాం గురుకులంలో కలుషిత ఆహారం, నీటి కారణంగా 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురై విలవిలలాడారు. అధికారులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. పాఠశాలకు సమీపంలో 50 పడకల CHC అందుబాటులో ఉన్నప్పటికీ.. ఘటన బయటకు రాకుండా ఉండేందుకు విద్యార్థినులను మాదిలింగి PHCకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదే గురుకులంలో గతంలో కలుషిత నీరు (Contaminated Water తాగి ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు మృతి చెందగా, వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ (Nara Lokesh) ఈ గురుకులంపై ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం గమనార్హం.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్‌కి పాఠశాలల పర్యవేక్షణ, విద్యార్థుల భద్రత కంటే రాజకీయ ప్రతీకారాలపైనే ధ్యాస ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యాశాఖ ఎంతటి దారుణమైన స్థితికి దిగజారిందో చెప్పడానికి వరుస ఘటనలే నిదర్శనం అంటున్నారు ఏపీ ప్రజలు.
- అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ పాఠశాలలో సెక్యూరిటీ లేకపోవడంతో ఆకతాయిలు పాఠశాలలోకి ప్రవేశించి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.
- కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరులో, మన్యం జిల్లా సాలూరులో పాఠశాల గోడలు కూలి ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హర్షవర్ధన్, అరుణ్ తేజ మృతిచెందారు.
- మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో కనీసం తాగడానికి పరిశుభ్రమైన నీరు కూడా అందించకపోవడంతో విద్యార్థులు విష జ్వరాలు, అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు.
- కల్తీ ఆహారం తిని వేలాది మంది విద్యార్థులు ఈ రెండేళ్లలో ఆస్పత్రి పాలైన ఘటనలు కోకొల్లలు ఉన్నాయంటున్నారు.
పిల్లల ప్రాణాలు పోతున్నా, పాఠశాలల్లో భద్రత కరువైనా, హాస్టళ్లలో కలుషిత ఆహారం పెడుతున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కనీసం క్షేత్రస్థాయి పరిశీలన చేయడం లేదు. కేవలం టీడీపీ(TDP) మీడియాను అడ్డంపెట్టుకొని సమీక్షలు, ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రసారాలు చేయించుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
కురుపాం గురుకులంలో 44 మంది విద్యార్థినుల అస్వస్థతపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులతో పాటు విద్యాశాఖ నిర్లక్ష్యంపై బేషరతుగా సమాధానం చెప్పాలని బాధితుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కురుపాం ఆశ్రమ పాఠశాలలో దారుణంఒకే గదిలో 60 మంది జ్వరపీడితులువిద్యార్థుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిగిరిజన విద్యార్థులపై కనీసం కనికరం చూపించని చంద్రబాబు ప్రభుత్వంక్లాస్ రూమ్ నే సిక్ రూమ్ గా మార్చిన వైనంచెదలు పట్టేసిన సిక్ రూమ్.. గిరిజన గురుకులంలో దయనీయ పరిస్థితిఇదే గురుకుల పాఠశాలలో గతంలో ముగ్గురు విద్యార్థులు మృతి
— Telugu Feed (@Telugufeedsite) November 6, 2026








