పోలింగ్ కేంద్రంలో మంత్రి అచ్చెన్న సోదరుడి హల్‌చల్‌

పోలింగ్ కేంద్రంలో మంత్రి అచ్చెన్న సోదరుడి హల్‌చల్‌

Summarize with AI

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పట్టుపురం పంచాయతీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 23, 24 పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు ప్రసాద్‌ పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రంలోనే వైసీపీ నేతలు, సాధారణ ఓటర్లపై దాడులకు పాల్పడుతూ ఓటింగ్‌ ప్రక్రియను ప్రభావితం చేసినట్లు ఘటన చోటుచేసుకుంది. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలపై దాడులు చేయడమే కాకుండా, వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.

పట్టుపురంలో చోటుచేసుకున్న పరిణామాలతో 23, 24 పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల అధికారులు, పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment