రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా(Richest Person in Asia) నిలిచారు. ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్ల జాబితా (Forbes Real-Time Billionaires List) ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల భారీ ర్యాలీతో అంబానీ సంపద ఒక్కరోజులో సుమారు 8.5 బిలియన్ డాలర్లు (8.5 Billion Dollars) పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తి విలువ 88.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బైట్‌డ్యాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ను(Zhang Yiming) వెనక్కి నెట్టి అంబానీ ఆసియా కుబేరుడిగా అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. జాంగ్ యిమింగ్ సంపద 84 బిలియన్ డాలర్లుగా ఉండగా, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Gautam Adani) 80.1 బిలియన్ డాలర్ల సంపదతో తర్వాతి స్థానంలో ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు (Reliance Industries Shares) సోమవారం దాదాపు 12 శాతం పెరగడం అంబానీ సంపద భారీగా పెరగడానికి ప్రధాన కారణమైంది. 2020 తర్వాత రిలయన్స్ షేర్లు ఒకే రోజు సాధించిన అతిపెద్ద పెరుగుదల ఇదే. జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ (Stock Market Listing) కావడం, రిలయన్స్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించడం కూడా ఇన్వెస్టర్లలో సానుకూల స్పందనకు దోహదపడ్డాయి. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో అత్యధికంగా సంపద పెంచుకున్న బిలియనీర్ల జాబితాలో అంబానీ రెండో స్థానంలో నిలిచారు.








