కర్నూలులో వైసీపీ అభ్యర్థిపై రాళ్లు, వేట కొడవళ్లతో దాడి

కర్నూలులో వైసీపీ అభ్యర్థిపై రాళ్లు, వేట కొడవళ్లతో దాడి

Summarize with AI

కర్నూలు(Kurnool) జిల్లాలో టీడీపీ గూండాల దాడులు (TDP Goons Attacks) కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటమి భయంతో టీడీపీ నాయకులు దాడులతో దిగుతున్నారు. ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ(YSRCP) అభ్యర్థులపై రాళ్లు(Stones), వేట కొడవళ్లతో(Sickles) దాడికి పాల్పడ్డారు. కర్నూలు మండలం తొలిసావపురం వైసీపీ ఎంపిటీసీ అభ్యర్థి బోయ సరస్వతమ్మపై(Boya Saraswathamma) దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో సరస్వతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు గాయపడ్డారు. టీడీపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి(Vishnuvardhan Reddy) అనుచరులు బరితెగించి దాడులు చేశారని బాధితులు తెలిపారు.

కాగా, సంకేసులలోని ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారాన్ని(Election Campaign) టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయొద్దంటూ దాడికి దిగారు. నిన్న మున్సిపల్‌ పోలింగ్‌లో టీడీపీ(TDP) అక్రమాలకు తెగబడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల టీడీపీ పచ్చ పోలీసులతో కలసి ఓటర్లను ఓట్లు వేసుకోనివ్వలేదు.

కొన్ని బూత్‌ల్లో వెబ్‌ కెమెరాల సాక్షిగా మహిళల ఓట్లు పురుషులు వేయడం గమనార్హం. కొన్ని మున్సిపాలిటీల్లో పచ్చమూకలు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను (YSRCP Polling Agents) బయటకు లాగి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలీసులే వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపి పచ్చ పార్టీకి అనుకూలంగా దొంగ ఓట్లు వేయించారు. మొత్తంగా ఆదివారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడింది. ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ పలు వార్డుల్లో పచ్చ నేతలు దొంగ ఓట్లు వేశారు. కొన్ని చోట్ల రిగ్గింగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment