తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. ఎక్స్ వేదికగా కొండా సురేఖ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతంలో కేటీఆర్‌పై తాను చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని, తాను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
కేటీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశంతో తాను ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. తన వ్యాఖ్యల వల్ల కేటీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురై ఉంటే అందుకు చింతిస్తున్నానని తెలిపారు. గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
కొండా సురేఖ తాజా ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో చోటుచేసుకున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో ఆమె చేసిన ఈ ప్రకటనపై బీఆర్ఎస్ శ్రేణులు, రాజకీయ వర్గాల్లో ఎలాంటి స్పందన వ్యక్తమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.








