‘మెగావర్స్’తో మరోసారి హోస్ట్‌గా చిరంజీవి..

‘మెగావర్స్’తో మరోసారి హోస్ట్‌గా చిరంజీవి..

Summarize with AI

మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు ఓటీటీ వేదికగా కొత్త టాక్ షోతో ముందుకు రానున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షోలో చిరంజీవి తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోకు పనిచేసిన ప్రముఖ రచయిత బీవీఎస్ రవి.. చిరంజీవి టాక్ షో కోసం పనిచేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో మంగళవారం ఈ టాక్ షో చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సత్య పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ‘మెగావర్స్’ సాధారణ టాక్ షోల తరహాలో ఉంటుందా? లేక విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొననున్నారు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుంది అనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. చిరంజీవి కొత్త అవతారాన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment