మ‌రోసారి ఎస్ఈసీ గ‌డ‌ప తొక్కిన‌ వైసీపీ.. ఈసారి ఎందుకంటే..

మ‌రోసారి ఎస్ఈసీ గ‌డ‌ప తొక్కిన‌ వైసీపీ.. ఈసారి ఎందుకంటే..

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) సందర్భంగా నామినేషన్ల తిరస్కరణలు(Rejection of Nominations), బలవంతపు ఏకగ్రీవాలు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై వైసీపీ(YSRCP) నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఎన్నికల నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. వైసీపీ(YSRCP) ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy), మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (TJR Sudhakar Babu) తదితరులు ఎస్ఈసీని (SEC) కలిసి తమ అభ్యంతరాలను వివరించారు.

బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారు
ఎస్ఈసీని (SEC) కలిసిన అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదని, అప్పీళ్లకు వెళ్లినా అభ్యర్థులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ), నో డ్యూస్ పత్రాలు (No Dues Certificate) అవసరం లేదని నిబంధనలు చెబుతున్నప్పటికీ, వాటి పేరుతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా రుణాల (DWCRA Loans) వివరాలు, భార్య ఆస్తుల వివరాలు సమర్పించలేదనే కారణాలతోనూ నామినేషన్లను తిరస్కరిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల అధికారుల తీరుపై విమర్శలు
రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు)(Returning Officers – ROs), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) (Assistant Electoral Registration Officers – EROs) అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అప్పిరెడ్డి విమర్శించారు. బీ-ఫారాలు సమర్పించినప్పుడు రసీదులు కూడా ఇవ్వడం లేదని మాట్లాడారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని అన్నారు. వైసీపీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూడా తెలిపారు.

నకిరేకల్‌లో హనుమాయమ్మ (Hanumayamma) భర్తను పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం జెడ్పీటీసీ అభ్యర్థి కొక్కిలిగడ్డ భూలక్ష్మి(Kokkilagadda Bhulakshmi) కుమారుడిపై కేసులు నమోదు చేశారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. నగరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉపసంహరణ గడువు ముగియకముందే ఎన్నికైనట్లు డిక్లరేషన్ ఇచ్చారని, రాజంపేటలోనూ చైర్మన్ ఎన్నిక విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

2029 ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రలు: సుధాకర్ బాబు
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (TJR Sudhakar Babu) మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ(TDP) కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఆందోళనతో ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారని విమర్శించారు. 2029 నాటికి టీడీపీ చీలిపోతుందని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వైఖరిలో మార్పు వస్తే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) రాజకీయాల్లోకి వస్తే టీడీపీ(TDP) పరిస్థితి మారుతుందంటూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల తిరస్కరణలు, ఏకగ్రీవాలు, ఎన్నికల అధికారుల వ్యవహారశైలిపై తాము లేవనెత్తిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం స్పందించాలని వైసీపీ నేతలు కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం తీసుకునే తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment