కాలేజీ రోజులు జీవితంలో మళ్లీ తిరిగిరాని మధురమైన జ్ఞాపకాలంటూ విక్టరీ వెంకటేష్ విద్యార్థులకు ఆసక్తికర సందేశం ఇచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఓ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. క్లాసులు బంక్ కొట్టడంలోనూ ఓ ప్రత్యేకత ఉంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. కాలేజీ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూనే, తమ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. స్నేహితులతో కలిసి మాట్లాడుకునే సమయంలోనే కొత్త ఆలోచనలు పుడతాయని, వాటిని ఆచరణలో పెట్టేందుకు కృషి చేయాలని చెప్పారు.
డిగ్రీ ఉద్యోగాన్ని సంపాదించిపెట్టవచ్చని, కానీ మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యమని వెంకటేష్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడంతో ఆడిటోరియం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్ 30న విడుదల కానున్న తమ సినిమాను థియేటర్లలో చూసి ప్రేక్షకులు ఆస్వాదించాలని కోరారు. క్లాస్ బంకింగ్పై వెంకటేష్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.








