మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?

మహిళల టీ20 వరల్డ్ కప్.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే?

Summarize with AI

2028 మహిళల టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ మెగా టోర్నీని సెప్టెంబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 1 వరకు పాకిస్థాన్‌ వేదికగా నిర్వహించనున్నారు. అయితే, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హైబ్రిడ్‌ మోడల్‌ అమలు కానుంది. ఇందులో భాగంగా భారత జట్టు ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్‌లో నిర్వహించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడించాయి. అయితే, భారత్‌ మ్యాచ్‌లకు వేదికపై ఐసీసీ ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) భారత జట్టు పాల్గొనని గ్రూప్‌ దశ, నాకౌట్‌ మ్యాచ్‌లను తమ దేశంలో నిర్వహించాలని భావిస్తోంది. ఒకవేళ భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించకపోతే టైటిల్‌ పోరును లాహోర్‌లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఇదే హైబ్రిడ్‌ విధానం అమలైంది. అప్పుడు భారత జట్టు తన మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడింది. అయితే, 2028 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ వేదికలపై పూర్తి స్పష్టత రావాలంటే ఐసీసీ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment