రాష్ట్రపతి, సీజేఐకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ

రాష్ట్రపతి, సీజేఐకి వైసీపీ ఎంపీ గురుమూర్తి లేఖ

Summarize with AI

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీఐజీ కోయా ప్రవీణ్‌, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌ సహా పలువురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, డీవోపీటీ, గవర్నర్‌కు లేఖలు రాశారు.

2019 ఎన్నికల్లో పక్షపాతంగా వ్యవహరించారనే కారణంతో కోయా ప్రవీణ్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించిన విషయాన్ని గురుమూర్తి గుర్తుచేశారు. ఆయనను మళ్లీ ఎన్నికల విధుల్లో నియమించడం నిబంధనల ఉల్లంఘన అని ఆరోపిస్తూ, హైకోర్టు ఆదేశాల అమలు, పోలీసుల పక్షపాతం, పర్యవేక్షణ వైఫల్యంపై స్వతంత్ర విచారణ కోరారు.

పుంగనూరులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, కడప, అన్నమయ్య జిల్లాల్లోని పులివెందుల, కమలాపురం, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో నామినేషన్లను అడ్డుకున్నారని గురుమూర్తి ఆరోపించారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ నుంచి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని, కమలాపురంలో 47 స్థానాలకు 46 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఉన్నారని, బద్వేలులో చైర్మన్‌ పదవికి టీడీపీ అభ్యర్థులే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.

కోయా ప్రవీణ్‌, అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్‌లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని గురుమూర్తి కోరారు. సీసీటీవీ పుటేజ్, వీడియోలు, ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లను సేకరించి స్వతంత్ర విచారణ జరపడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment