వైసీపీ డిజిటల్ బుక్‌లో టీడీపీ అరాచకాలు

వైసీపీ డిజిటల్ బుక్‌లో టీడీపీ అరాచకాలు

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కూటమి ప్రభుత్వం, పోలీసులు కలిసి సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ రాక్షస రాజకీయాలను తిప్పికొట్టేందుకు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది.

ఎన్నికల్లో గెలుపు ఓటములకంటే కూడా, ప్రజాక్షేత్రంలో నిలబడి కార్యకర్తల్లో చైతన్యం నింపాలన్న వైయస్ జగన్ లక్ష్యం ఇప్పుడు వందశాతం ఫలించింది. అన్నింటికంటే మించి.. టీడీపీ గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న పోలీసుల అక్రమాలన్నీ ఇప్పుడు ‘వైసీపీ డిజిటల్ బుక్’‌లో పక్కాగా నిండిపోవడం అధికార పార్టీలో వణుకు పుట్టిస్తోంది.

అణువణువూ రికార్డు.. AI టూల్స్‌తో నిఘా
స్థానిక ఎన్నికల ప్రచారంలోనూ, నామినేషన్ల పర్వంలోనూ పోలీసులు – టీడీపీ శ్రేణులు కుమ్మక్కై చేసిన దాడులన్నీ వందల సంఖ్యలో నమోదయ్యాయి. అయితే, ఈసారి వైయస్ఆర్సీపీ అత్యంత దూరదృష్టితో అడుగులు వేసింది. సాంకేతికతను జోడించి డిజిటల్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంది:

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా జరిగిన ప్రతి అన్యాయాన్ని, దాడులను ఎప్పటికప్పుడు వీడియోలు తీసి పక్కాగా స్టోరేజ్ చేశారు. దాడులకు పాల్పడిన టీడీపీ మూకలను, వారికి అడ్డగోలుగా సహకరించి ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసు అధికారులను AI టూల్స్ సహాయంతో మరీ గుర్తించి ప్రత్యేకంగా డేటా సేకరించారు.

రేపు మళ్లీ అధికారంలోకి వచ్చినా, లేదా చట్టపరమైన న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చినా ఈ డిజిటల్ డాక్యుమెంటేషన్ బలమైన అస్త్రంగా మారుతుందని పార్టీ ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుంది.

టీడీపీ క్యాడర్‌లో గుబులు..
అధికార బలంతో తాము చేస్తున్న అరాచకాలన్నీ ఒక డిజిటల్ రికార్డు రూపంలో భద్రపడుతున్నాయనే విషయం తెలియడంతో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో తీవ్ర గుబులు మొదలైంది. “రేపు ప్రభుత్వ మారితే మన పరిస్థితి ఏంటి? ఈ లెక్కలన్నీ ఎలా తేలుస్తారు?” అనే చర్చ ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లోనే అంతర్గతంగా జరుగుతోంది.

వైయస్ జగన్ ఇస్తున్న మాస్ వార్నింగ్స్ బలంగా పనిచేస్తుండటంతో, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే భ్రమల్లో ఉన్న పోలీసు అధికారులకు, టీడీపీ గూండాలకు ఈ డిజిటల్ బుక్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాలు స్పష్టంగా వెళ్తుండటంతో, అధికార పార్టీ వర్గాల్లో భయాందోళనలు తారస్థాయికి చేరాయి. దాడులకు భయపడకుండా వైయస్ఆర్సీపీ శ్రేణులు చూపుతున్న తెగువ, పార్టీ అనుసరిస్తున్న ఈ డిజిటల్ వ్యూహం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment