కేబినెట్ భేటీకి జనసేన మంత్రులు డుమ్మా.. స‌ర్వ‌త్రా చ‌ర్చ‌

కేబినెట్ భేటీకి జనసేన మంత్రులు డుమ్మా.. స‌ర్వ‌త్రా చ‌ర్చ‌

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంటున్న తరుణంలో అధికార కూటమిలో సీట్ల పంపకాల వివాదం తారాస్థాయికి చేరిందా..? తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశానికి జనసేన పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు ఏకకాలంలో గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులు, బీసీ రిజర్వేషన్ల అంశాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. అయితే ఈ కీలక భేటీకి జనసేన పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.

పైకి మాత్రం ఎవరి వ్యక్తిగత కారణాలు, పర్యటనలు వారు చెబుతున్నప్పటికీ, ఈ గైర్హాజరు వెనుక అసలు కారణం సీట్ల సర్దుబాటేనని స్పష్టమవుతోందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం 15 శాతం సీట్లు మాత్రమే కేటాయించాలంటూ మంత్రి నారా లోకేష్ ఒక నిర్దిష్టమైన ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రతిపాదించిన ఈ సీట్ల వాటా షరతుపై జనసేన అధినాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్యాడ‌ర్‌కు సంకేతాలు ఇచ్చేందుకు జ‌న‌సేన మంత్రులు కేబినెట్ మీటింగ్‌కు హాజ‌రు కాలేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇది ముమ్మాటికీ సీట్ల పంచాయితీనేనా?
ముగ్గురు జనసేన మంత్రులు ఒకేసారి కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నా.. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ముమ్మాటికీ సీట్ల పంచాయితీ రగడే అని ధ్రువీకరిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పట్టుకోసం పట్టుబట్టాలని చూస్తున్న జనసేనకు, కూటమిలో పెద్దన్న పాత్ర ద్వారా పరిమితులు విధించాలని చూస్తున్న టీడీపీ వ్యూహాలకు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు కేబినెట్ బహిష్కరణ రూపంలో బయటపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వేళ కూటమిలోని ఈ అంతర్గత కుమ్ములాటలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment