ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 12 అజెండా అంశాలకు ఆమోదం

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 12 అజెండా అంశాలకు ఆమోదం

Summarize with AI

అమరావతిలోని సచివాలయంలో(Secretariat) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మొత్తం 12 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయం, వైద్యం, విద్య, సంక్షేమం, భూ వర్గీకరణ, ఉన్నత విద్యకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  • AP HIMS ఏర్పాటుకు రూ.20.62 కోట్లు.. 72 నెలల అమలు.
  • రేపల్లె 30 పడకల CHCని (CHC – Community Health Centre) 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌.. రూ.58.42 కోట్లు, 66 పోస్టులు.
  • 2026-27 తల్లికి వందనం (Thalliki Vandanam) మార్గదర్శకాలకు రాటిఫికేషన్.
  • సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ ఛార్జీల (Diet Charges) పెంపునకు ఆమోదం.
  • విశాఖ మారికవలసలో గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(Centre of Excellence) ఏర్పాటు.
  • కుప్పంలో అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూ వర్గీకరణ మార్పు.
  • ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు రాటిఫికేషన్.
  • కడప పాతూరులో ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల భూమి దేవాదాయ శాఖకు బదలాయింపు.
  • కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ కోసం 7 ఎకరాల భూ వర్గీకరణ మార్పు.
  • ఏపీ విద్యా చట్టం-1982 సవరణలకు ఆమోదం.
  • విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ వర్సిటీల క్యాంపస్‌ల కోసం కొత్తపాలసీ-2026కు గ్రీన్ సిగ్నల్.
  • క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సదుపాయాలపై సమగ్ర విధానం రూపొందించేందుకు ఆమోదం.

Join WhatsApp

Join Now

Leave a Comment