అమరావతి వ‌రదలో వేల కోట్లు.. సీమకు కంటి తుడుపు చర్యలా?

అమరావతి వ‌రదలో వేల కోట్లు.. సీమకు కంటి తుడుపు చర్యలా?

Summarize with AI

రాయలసీమ అభివృద్ధి(Rayalaseema Development), సాగునీటి ప్రాజెక్టుల(Irrigation Projects) విషయంలో కూటమి ప్రభుత్వం (Alliance Government) చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలకు అస్సలు పొంతన లేదని వైఎస్సార్‌సీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నగరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలనలోని అసంబద్ధతలను, చంద్రబాబు ప్రదర్శిస్తున్న ‘కపట రాయలసీమ ప్రేమను’ (Fake Rayalaseema Love)ఆధారాలతో సహా ఎండగట్టారు.

అబద్ధాల్లో పోటీ పడుతున్న బాబు, పవన్!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో శంకుస్థాపన (Foundation Stone) చేసిన ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ, తీవ్రమైన ‘క్రెడిట్ చోరీ’కి(Credit Theft) పాల్పడుతున్నారని రోజా మండిపడ్డారు. “రూ.24 వేల కోట్ల ప్రాజెక్టులు పెట్టామని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా.. ఆ ప్రాజెక్టులు ఎక్కడున్నాయో ప్రజలకు ధైర్యంగా చూపించగలరా?” అని రోజా సవాల్ విసిరారు. నిజంగా సీమపై చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును (Rayalaseema Lift Irrigation Project) తక్షణమే పూర్తి చేస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు రాష్ట్రంలో కరువు (Drought) తాండవిస్తుందని, ఈ పరిణామం ఆయన పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్సార్, వైఎస్ జగన్ పాలనను చూసి వ్యవసాయం(Agriculture), సాగునీరు(Irrigation) ఎలా అందించాలో చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను మూడేళ్లుగా పక్కనపడేసి, ఇప్పుడు ‘రైజింగ్ రాయలసీమ’(Rising Rayalaseema) అంటూ కొత్త పేర్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ (Telangana) అసెంబ్లీలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించిన రోజా, సొంత నియోజకవర్గాలకు నీరివ్వలేని దుస్థితిపై నిలదీశారు. కుప్పానికి(Kuppam), పిఠాపురానికి (Pithapuram) కనీసం తాగు, సాగునీరు అందించలేని చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్‌లు(Pawan Kalyan).. రాయలసీమను అభివృద్ధి చేస్తామంటూ రంగుల ప్రపంచాన్ని చూపుతున్నారని విమర్శించారు.

అమరావతిలో వరదలు, బురద పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును నీళ్లలా పారబోస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు మాత్రం ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వకుండా తీవ్ర నమ్మకద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు.

అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇంకా అబద్ధాలతో, ప్రచార ఆర్భాటాలతో డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలకు క్షేత్రస్థాయిలో కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో లెక్కలతో సహా రికార్డులు బయటపెట్టాలని రోజా సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో కూటమి నటనను ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment