కూట‌మి స్క్రిప్ట్‌.. ఢిల్లీ పెద్దల మందలింపుతో ట్వీట్ డిలీట్!

కూట‌మి స్క్రిప్ట్‌.. ఢిల్లీ పెద్దల మందలింపుతో ట్వీట్ డిలీట్!

Summarize with AI

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నేతలతో కలిసి తెనాలి బహిరంగ సభలో జగన్‌పై కేంద్ర‌మంత్రి నోరుపారేసుకున‌నారు. దీంతో ఆ ఆరోపణలు పచ్చి అబద్ధాలని వైసీపీ సోషల్ మీడియా ఆధారాలతో సహా ఎండగట్టింది. దీంతో తన ట్విట్టర్ (X) ఖాతా నుంచి జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ మాట్లాడిన వీడియో ట్వీట్‌ను డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తెనాలి సభలో హౌసింగ్ పనులపై వైఎస్ జగన్‌పై నోరుపారేసుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌కు వైసీపీ శ్రేణులు కేంద్ర పార్లమెంట్ నివేదికలతోనే సమాధానం ఇచ్చాయి. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వమే లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి రికార్డు స్థాయిలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలే స్పష్టం చేశాయి.

కేంద్రంలో బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూ, సొంత ప్రభుత్వ అధికారిక రికార్డులను పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేయడంపై వైసీపీ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ జోలికి వస్తే అస‌లు ఊరుకోని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆధారాల‌తో త‌న ప్ర‌తాపాన్ని చూపించింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయన చేసిన ట్వీట్ కింద కేంద్ర ప్రభుత్వ పార్లమెంటరీ నివేదికలను పోస్ట్ చేస్తూ నిలదీసింది.

వాస్తవాలు బయటకు రావడంతో పాటు, సొంత కేంద్ర ప్రభుత్వ నివేదికలకే భిన్నంగా మాట్లాడటంతో ఢిల్లీలోని పెద్దలు శివరాజ్ సింగ్‌ను మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్, హౌసింగ్‌పై జగన్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను సైలెంట్‌గా డిలీట్ చేసి వెనక్కి తగ్గడం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment