తానొక వాటర్ మ్యాన్ (Water Man) అని, ఆ బిరుదు వచ్చినందుకు సంతోషంగా ఉందని ఉప్పొంగిపోతున్న చంద్రబాబు (Chandrababu) పాలనలో కరువు (Drought) ఎలా వచ్చింది..? ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా(Andhra Pradesh) తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వమే (Coalition Government) అంగీకరిస్తూ కరువు మండలాలను గుర్తించింది.
వర్షాభావ పరిస్థితులతో పంటలు (Crops) ఎండిపోయి రైతాంగం (Farming Community) అల్లాడుతుంటే.. ఇన్‌పుట్ సబ్సిడీ (Input Subsidy) ప్రకటించి అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పత్రికల్లో, టీవీల్లో వ్యక్తిగత ప్రచారాల కోసం లక్షల రూపాయల ప్రభుత్వ డబ్బులను మంజూరు చేయడంపై రాష్ట్ర రైతాంగం ఆగ్రహంతో రగిలిపోతోంది.
రాష్ట్రంలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం 688 మండలాలకు గానూ, ఏకంగా 388 మండలాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 21 జిల్లాల (21 Districts) వ్యాప్తంగా 283 మండలాలు తీవ్ర కరువు ఎదుర్కొంటుండగా, మరో 105 మండలాలు మధ్యస్థ కరువుతో అల్లాడుతున్నాయి. సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, రాజధాని అమరావతి(Capital Amaravati), ప్రకాశం జిల్లాలు కూడా కరువు దెబ్బకు విలవిలలాడుతున్నాయి. అనకాపల్లి, బాపట్ల, మార్కాపురం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రకటించిన మండలాలన్నీ తీవ్ర కరువు కిందే నమోదు కావడం గమనార్హం.
మీడియా బలాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పొలాల్లో పైరు ఎండిపోయి రైతులు(Farmers) రోడ్డెక్కుతున్నప్పుడల్లా.. ప్రతిపక్ష వైసీపీపై(YSRCP) నిందలు వేయడం, అవసరమైనప్పుడల్లా వివేకా హత్య కేసును(Viveka Murder Case), లిక్కర్ కేసును (Liquor Case) తెరపైకి తీసుకువచ్చి మీడియాలో రోజంతా హడావుడి చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటున్నారు.
ఆకలిమంటలతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడానికి ఒక్క రూపాయి కేటాయించని చంద్రబాబు ప్రభుత్వం, తన పబ్లిసిటీ పిచ్చి కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తోంది. ఢిల్లీలో రిపబ్లిక్ టీవీ (Republic TV) వార్షిక సమ్మిట్‌లో(Annual Summit) ప్రచార విజ్ఞాపనల ప్రసారం పేరిట ఏకంగా రూ. 43.83 లక్షలు విడుదల చేయడం గమనార్హం.
కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను (Social Media Influencers) కొనుగోలు చేసి తమ ప్రభుత్వ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వ ధనాన్ని కట్టబెట్టేందుకు సిద్ధపడిందన్న చర్చ కూడా జరుగుతోంది. రోజుకో జిల్లాలో ప్రచార సభలు పెడుతూ, భారీ ఫ్లెక్సీలతో “వాటర్ మ్యాన్” అని డప్పు కొట్టుకోవడమే తప్ప, పొలాల్లో ఎండిపోతున్న పంటలకు నీరివ్వడంలోనూ, ఎండిన పంటలకు నష్టపరిహారం అందించి ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







