కాస్మోపాలిటన్ ఇండియా (Cosmopolitan India) 30వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్‌లో హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మ్యాగజైన్ కోసం చేసిన ఫొటోషూట్‌లో బ్లాక్ ఫిట్డ్ డ్రెస్, బ్లష్-పింక్ హాల్టర్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. మినిమల్ జ్యువెలరీతో ఆమె లుక్‌ను సింపుల్‌గా, ఎలిగెంట్‌గా తీర్చిదిద్దారు. రుక్మిణి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
ఆసక్తికర విషయాలు పంచుకున్న బ్యూటీ
కాస్మోపాలిటన్ ఇండియా రుక్మిణి వసంత్‌తో ‘Rehearsing Life with Rukmini Vasanth’ పేరుతో ప్రత్యేక ఫీచర్‌ను కూడా ప్రచురించింది. ఇందులో తన ఆలోచనలు, నటనతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు. తన నోట్‌బుక్‌ను ‘introvert’s shield’గా భావిస్తానని రుక్మిణి చెప్పినట్లు మ్యాగజైన్ కంటెంట్ పేర్కొంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఎన్టీఆర్ ‘Dragon’తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.








