క‌డ‌ప‌లో ఎమ్మెల్యే తిర‌గ‌బ‌డ్డ టీడీపీ క్యాడ‌ర్‌.. సంచ‌ల‌న ఆడియో

క‌డ‌ప‌లో ఎమ్మెల్యే తిర‌గ‌బ‌డ్డ టీడీపీ క్యాడ‌ర్‌.. సంచ‌ల‌న ఆడియో

Summarize with AI

కడప రాజకీయం (Kadapa Politics) ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీకి (TDP) కడప కోటగా నిలిచిన క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు సొంత ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డిపై(Reddappagari Madhavi Reddy) తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. “పార్టీ కోసం రక్తం చిందించి, కేసులు ఎదుర్కొన్న నాయకులను విస్మరించి, వలస నాయకులకు పీఠాలు వేస్తున్నారు” అంటూ టీడీపీ సీనియర్ నాయకుడు చెన్నంశెట్టి మురళీ (Chennamsetti Murali) తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన ఆడియో టేప్ కడప జిల్లా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

“కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించుకోండి చూద్దాం”
ఎమ్మెల్యే మాధవిరెడ్డి (MLA Madhavi Reddy) వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన చెన్నంశెట్టి మురళీ, రాబోయే కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల (Kadapa Municipal Corporation Elections) వేదికగా ఆమెకు బహిరంగ సవాల్ విసిరారు. “గత అసెంబ్లీ ఎన్నికల్లో జెండా మోసిన కార్యకర్తల కష్టం వల్ల గెలిచారు. ఇప్పుడు మీ వెంట అసలైన టీడీపీ కార్యకర్త ఒక్కరూ లేరు. దమ్ముంటే, చేతనైతే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డుల్లో మీరు పెట్టిన అభ్యర్థులను మీ సొంత బలంతో గెలిపించుకోండి చూద్దాం!” అని సవాల్ విసిరారు.

గత రెండేళ్ల కాలంలో కడప నగరంలో టీడీపీని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆరోపించారు. కడప కార్పొరేషన్‌ పరిధిలోని దాదాపు అన్ని డివిజన్లలోనూ ఇదే తరహా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని తెలిపారు.

కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టించడమేంటని ఆగ్రహం
పాదయాత్రలు, ఎన్నికల పోరాటాల్లో పార్టీ కోసం ముందుండి లీగల్ కేసులు సైతం భరించిన నిజమైన తమ్ముళ్లను ఎమ్మెల్యే పక్కనబెట్టేశారని మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి చివరి నిమిషంలో వలస వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత కల్పిస్తూ, పాత కార్యకర్తలను తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే స్థాయికి దిగజారి సొంత టీడీపీ కార్యకర్తలపైనే దాడులు చేయిస్తూ, పోలీసులతో కేసులు పెట్టించడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను, రౌడీషీటర్లను అడ్డుపెట్టుకుని, మంత్రులతో ప్రచారం చేయించినా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే వర్గానికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

మాధవిరెడ్డి కంటే వ్యతిరేక వర్గానికే ఎక్కువ బలం
ప్రస్తుతం కడప టీడీపీలో(TDP) ఎమ్మెల్యే మాధవిరెడ్డి వర్గం కంటే కూడా ఆమె తీరును నిరసిస్తున్న వ్యతిరేక వర్గానికే క్షేత్రస్థాయిలో అధిక బలం ఉందని చెన్నంశెట్టి మురళీ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన కార్యకర్తలనే వేధింపులకు గురిచేస్తున్న ఎమ్మెల్యేకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప ప్రజలు, టీడీపీ శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కడప నగరంలో ఎమ్మెల్యే వర్గానికి, పార్టీ సీనియర్ కార్యకర్తల వర్గానికి నడుమ ముదిరిన ఈ అంతర్గత విభేదాలు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment