నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్‌ రూ.100 కోట్ల సినిమా.. ‘ది ప్యారడైజ్’ రికార్డు

నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్‌ రూ.100 కోట్ల సినిమా.. ‘ది ప్యారడైజ్’ రికార్డు

Summarize with AI

న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’(The Paradise) బాక్సాఫీస్ భారీ రాబడుతోంది. తొలి రోజే కాదు.. రెండో రోజు కూడా అదే రేంజ్ హోల్డ్ సాధించి థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీకాంత్ ఒదెల (Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్(Gross Collections) రాబట్టి నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా రికార్డు సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా భాషల్లోనూ ‘ది ప్యారడైజ్’ జోరు చూపిస్తోంది. తమిళ, కన్నడ మార్కెట్లతో పాటు హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేట్రికల్ రన్ (Theatrical Run) చాలా స్ట్రాంగ్‌గా సాగుతోంది. ఇక ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమా ఇంకో లెవెల్‌లో ఇంపాక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో(North America) ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 1.7 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును దాటేసిన ఈ చిత్రం, చాలా వేగంగా 2 మిలియన్ డాలర్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్(Advance Bookings) చాలా ఆశాజనకంగా ఉండటంతో, రాబోయే వీకెండ్‌లో ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తిరగరాయనుందని టీమ్ బలంగా నమ్ముతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment