విదేశీ ప‌ర్య‌ట‌న‌పై అంత గోప్యం ఎందుకు..?

విదేశీ ప‌ర్య‌ట‌న‌పై అంత గోప్యం ఎందుకు..?

Summarize with AI

దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ (EC) తీరుపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లడం (Foreign Tour) తీవ్ర రాజకీయ చర్చకూ దారితీస్తోంది. ఈ నెల 25 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనను పూర్తిగా ‘ప్రైవేట్ టూర్’(Private Tour) అని ప్రకటిస్తూనే, ఆయన ఏ దేశానికి వెళ్తున్నారు, ఎక్కడ బస చేయనున్నారు అనే విషయాలను అత్యంత గోప్యంగా ఉంచడంపై మేధావులు, రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అత్యంత గోప్యత ఎందుకు..?
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక కీలక నేత విదేశాలకు వెళ్తున్నప్పుడు పర్యటన వివరాలను బహిర్గతం చేయకపోవడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర పరిపాలకుడిగా ఉన్న సీఎం పర్యటన వివరాలు ప్రజలకు తెలీకుండా దాచాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నెటిజ‌న్ల ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

దేశంలో ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై(EC) వివాదం (Controversy) కొన‌సాగిన స‌మ‌యంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ (Nara Lokesh) విదేశీ పర్యటనల బాట పడుతున్నారంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్డీయే కూటమిలో(NDA Alliance) కీలక భాగస్వామిగా ఉంటూ, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు.. వ్యవస్థలపై, ఎన్నికల కమిషన్ స్వతంత్రతపై వివాదం నడుస్తున్న సమయంలో అనుభ‌వాన్ని ఉప‌యోగించి వాటిని స‌ర్దుమ‌ణిగించేందుకు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల్సిన స‌మ‌యంలో విదేశీ పర్యటనల‌కు వెళ్ల‌డం భావ్యం కాదంటున్నారు.

ఇటీవ‌ల నారా లోకేష్ (Nara Lokesh) సైతం త‌న శాఖ‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌కుండా, ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు(Press Releases) లేకుండా అనేకమార్లు అన‌ధికారిక విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాజాగా, చంద్ర‌బాబు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడం ద్వారా అధికార పార్టీయే అనుమానాలకు ఆజ్యం పోస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైవేట్ టూర్ అయినప్పటికీ ఒక సీఎం భద్రత, ఆయన ఎక్కడికి వెళ్తున్నారనే పారదర్శకత ప్రజలకు తెలిసి ఉండాలి. ఇప్పటికైనా ఈ రహస్య విదేశీ పర్యటనపై తలెత్తుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment