ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం..

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం..

Summarize with AI

హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర.. గణేశుడిని లిఫ్ట్ చేసే క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొంత ఆలస్యమైంది. అధికారులు సాంకేతిక లోపాన్ని పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్రను ప్రారంభించారు. భక్తుల కోలాహలం, సన్నాయి మేళాల నడుమ గణనాథుడు గంగమ్మ ఒడికి పయనమయ్యాడు. ఈసారి శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేకుండా సన్నాయి మేళాలతోనే నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-5 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు సందడిగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment