‘కూర్చోరా.. తాట తీస్తా’.. కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

'కూర్చోరా.. తాట తీస్తా'.. కార్య‌క‌ర్త‌ల‌పై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Summarize with AI

తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల పార్టీ. కార్య‌క‌ర్త‌ల మాటే ఫైన‌ల్ అని అగ్ర‌నాయ‌క‌త్వం ప‌దే ప‌దే చెబుతుంటుంది. కానీ, ఆ పార్టీలో క్యాడ‌ర్‌కు ఉన్న విలువ ఎలాంటిదో ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్ప‌క‌నే చెప్పారు. టీడీపీకి(TDP) చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే (Rampachodavaram MLA) శిరీష దేవి (Sireesha Devi) పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమావేశంలో నాయకులు(Leaders), కార్యకర్తలపై (Workers) ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘కూర్చోరా.. తాట తీసేస్తా’
రంప‌చోడ‌వ‌రంలో కార్యకర్తల సమావేశంలో కార్య‌క‌ర్త‌ల‌పై ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “కూర్చోరా నువ్వు.. తాట తీసేస్తారా ఎవడికైనా?”, “పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తున్నావా.. కూర్చోరా.. నేను మాట్లాడుతుంటే అడ్డుగా మాట్లాడుతావ్?” అంటూ ఆమె బూతుల అస‌భ్య‌క‌ర‌మైన (Abusive Obscene) వ్యాఖ్య‌లు క్యాడ‌ర్‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి.

ఏదైనా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తే కార్యకర్తలు జ‌నాన్ని సమీక‌రించ‌డంలో విఫ‌లం అవుతున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “ఏదైనా కార్యక్రమం ఉందంటే.. ఒక్కడు ఒక మనిషిని తీసుకోరాడు.. 10 మందిని వెనకేసుకొని రాడు. ఏదైనా కార్య‌క్ర‌మం చేస్తే నా ఫొటోల‌తో ఫ్లెక్సీలు కూడా ఒక్క‌డైనా కొట్టించాడా..? అంటూ చింద‌లు వేశారు.

పని చేయరు.. ఓట్లు వేయించలేరు.. మళ్లీ ఎమ్మెల్యేపై ఫిర్యాదులా(Complaints)? అని కార్య‌క‌ర్త‌ల‌పై ఎమ్మెల్యే శిరీష దేవి మండిప‌డ్డారు. “పని చేయరు, ఓట్లు వేయించలేరు, తిరిగి కష్టపడరు, పార్టీ కార్యక్రమాలు చేయరు.. మళ్లీ ఎమ్మెల్యే మీద కంప్లయింట్లు చేస్తారా?” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్లు చెబుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి పార్టీ కార్యకర్తలతో మాట్లాడే తీరుపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల్లో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) నుంచి ఇదే నేర్చుకున్నారా? అంటూ కొందరు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శిరీష దేవి.. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment