ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఎన్ని పోస్టులంటే..

ఏపీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. ఎన్ని పోస్టులంటే..

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీలో అక్ర‌మాల డొంక ఆరోప‌ణ‌లు కొన‌సాగుతున్న వేళ ప్ర‌భుత్వం ఏపీపీఎస్సీ (APPSC) ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వరుసగా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్లను అందుబాటులో ఉంచింది. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 729 పోస్టుల భర్తీ ప్రక్రియకు ప్రకటనలు జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 19 శాఖల్లోని పోస్టుల వివరాలను వెల్లడించగా.. మరో ఐదు శాఖలకు సంబంధించిన పోస్టులకు రేపు నోటిఫికేషన్లు, మరో పది శాఖలకు సంబంధించిన పోస్టులకు ఈ నెల 24న నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది.

వివిధ పోస్టులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఉద్యోగార్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 23, డ్రాప్స్‌మెన్ గ్రేడ్-2 20, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26 పోస్టులు ఉన్నాయి. అలాగే సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టులు 29 భర్తీ చేయనున్నారు.

మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు పోస్టులతో పాటు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ 78, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు 15 ఉన్నాయి. ఎండోమెంట్స్ విభాగంలో గ్రేడ్-3 ఈవో పోస్టులు 104 భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.

గ్రూప్-1లో 163 పోస్టులు
ఇక గ్రూప్-1 సర్వీసెస్‌కు సంబంధించి మొత్తం 163 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 11, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు 14, డీఎస్పీ (సివిల్) 36, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) 3 పోస్టులు ఉన్నాయి. అలాగే డీఈవోలు 14, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, ఆర్టీవోలు 3 పోస్టులు భర్తీ చేయనున్నారు.

డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సర్వీసెస్ పోస్టులు 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 పోస్టులు 12, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ 35 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

పలు శాఖల్లో ఉద్యోగ అవకాశాలు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎనలిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 18, అసిస్టెంట్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ 1, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ 12 పోస్టులు ఉన్నాయి. ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసులో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు 17 భర్తీ చేయనున్నారు.

అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు 73, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 196 ఉన్నాయి. ఏపీ అసెంబ్లీలో ఇంగ్లిష్, తెలుగు రిపోర్టర్ పోస్టులు 11, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 17 ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సర్వీసెస్ పోస్టులు 8, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు 37 భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.

ఏపీలో డీఎస్సీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని వైసీపీ, డీఎస్సీ ఉద్యోగ అభ్య‌ర్థులు ఆధారాలు బ‌య‌ట‌పెడుతున్న స‌మ‌యంలో.. ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేష‌న్లు విడుద‌ల కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment