కలెక్టర్ల సదస్సులో(Collectors Conference) అధికారుల తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి సీరియస్ అయ్యారు. తాను నిర్వహిస్తున్న సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడం, సదస్సులో 12 గంటల పాటు కూర్చొని చర్చల్లో పాల్గొనకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు ముందుగానే స్పష్టమైన సూచనలు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సదస్సులో 12 గంటల పాటు కూర్చోలేకపోతే ఎందుకని ప్రశ్నించారు. “తమాషాలాడుతున్నారా? ఎంత ధైర్యం నా సమావేశానికే డుమ్మా కొడతారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు అధికారులు ఫోన్లు కూడా తీసుకురావద్దని తాను ముందుగానే చెప్పానని చంద్రబాబు గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు తన ఆదేశాలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. కొందరు అధికారులు ఏమనుకుంటున్నారో అర్థం కావడం లేదని, సీఎస్ నోట్ చేసుకొని.. వాళ్లందరితో ఎక్స్ప్లనేషన్ ఇప్పించాలని ఆదేశించారు.
అధికారులు నాన్ సీరియస్‌గా మారారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక చెవిలో చెప్పిన విషయాన్ని మరో చెవిలో వదిలేస్తున్నారని అధికారుల పనితీరును (Performance) తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం(Coalition Government) నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు సీరియస్‌గా తీసుకుని అమలు చేయాలని సూచించారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులపై..
“ఒక పనికి ఒక ఉద్యోగస్తుడిని పెట్టాలా?” అంటూ గ్రామ సచివాలయ ఉద్యోగుల (Village Secretariat Employees) పనితీరుపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. “గ్రామ సచివాలయాల్లో ప్రతి ఒక్కడు ఏ పని ఉండదు. నన్ను స్పెషలైజ్ చేసేశారు.. కాబట్టి నేను ఈ పనే చేస్తా అంటాడు” అంటూ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
గ్రామ సచివాలయాల్లో అవసరం లేని పనులను (Unnecessary Work) తగ్గించి.. ఉద్యోగులను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్‌కు(Information Gathering) వినియోగించుకోవాలని సూచించారు. అవసరమైతే స్వర్ణ గ్రామాలకు(Swarna Villages) ఎలక్ట్రిక్ సైకిళ్లు (Electric Cycles) వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే వాహనం లేదని, ట్రాన్స్పోర్ట్ లేదని సిబ్బంది చెప్పే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు.
ఫైళ్ల క్లియరెన్స్‌లో సీఎం వెనుకబాటు
టెక్నాలజీ పితామహుడిగా, అడ్మినిస్ట్రేటర్‌గా చెప్పుకునే చంద్రబాబు ఫైళ్ల క్లియరెన్స్‌లో(File Clearance) మంత్రుల కంటే వెనుకపడడం సంచలనం. చంద్రబాబు మంత్రుల పనితీరును మండిపల్లి రాంప్రసాద్(Mandipalli Ramprasad), పయ్యావుల కేశవ్(Payyavula Keshav), కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఫైళ్ల క్లియరెన్స్‌కు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాను కూడా కొన్ని ఫైళ్లను క్లియర్ చేయడానికి నాలుగు రోజులు తీసుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. హోంమంత్రి పనితీరు కూడా ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. అయితే ఈ-ఫైళ్ల పరిష్కారంలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) ముందంజలో ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు.








