సంయుక్త పుట్టినరోజు స్పెషల్..

సంయుక్త పుట్టినరోజు స్పెషల్..

Summarize with AI

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’(Swayambhu). ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari) దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్(Bhuvan), శ్రీకర్ (Sreekar) నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డాల్స్ సంయుక్త మీనన్(Samyuktha Menon, నభా నటేష్ (Nabha Natesh) కథానాయికలుగా నటిస్తున్నారు. నేడు సంయుక్త పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది.

40 సెకన్ల వీడియోలో సంయుక్త చేతిలో కత్తి పట్టి, శత్రువులతో పోరాడే శౌర్యవంతమైన వీరనారి పాత్రలో(Brave Warrior Role) కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో భూమి అనే శక్తిమంతమైన పాత్రను ఆమె పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్ర అత్యంత సహజంగా, పవర్‌ఫుల్‌గా పండడం కోసం సంయుక్త ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఇప్పటివరకు వెండితెరపై సున్నితమైన భావాలు పలికించిన సంయుక్త.. స్వయంభులో ఓ యోధురాలిగా కనిపించనున్నారు. సంయుక్త కెరీర్‌లోనే ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్రగా నిలవనుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీని త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment