విదేశాల్లో ఉద్యోగం (Abroad Job) ఇప్పిస్తామని చెప్పి ఓ నిరుపేద కుటుంబాన్ని(Poor Family) మోసం (Cheating) చేశాడు ట్రావెల్ ఏజెంట్(Travel Agent). తన వ్యాపార కాంక్షకు ఓ ఆ కుటుంబం మలేషియాలో బందీగా మారింది. తమను కాపాడండి అంటూ మలేషియా(Malaysia) నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యాభర్తలిద్దరూ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. గాజువాకకు(Gajuwaka) చెందిన ట్రావెల్ ఏజెంట్ రామచంద్ర(Ramachandra) తమ నుంచి రూ.4 లక్షలు వసూలు చేసి మలేషియాకు పంపించారని బాధిత దంపతులు ఆరోపిస్తున్నారు.
రాజమండ్రికి(Rajahmundry) చెందిన భార్యాభర్తలిద్దరూ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇతర దేశానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. గాజువాకకు చెందిన రామచంద్ర అనే ఏజెంట్‌ను సంప్రదించారు. అయితే తమను ఉద్యోగం కోసం మలేషియాకు పంపిస్తామని ఏజెంట్ నమ్మించారని, ఉద్యోగ వీసా కాకుండా విజిటింగ్ వీసాపై మలేషియాకు పంపించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. మలేషియాలో తమను మరో హోటల్ యాజమాన్యానికి అప్పగించారని, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజెంట్ మోసంతో తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుందని బాధిత భార్యాభర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ నుంచి రూ.4 లక్షలు తీసుకుని మలేషియాకు పంపించిన ఏజెంట్ రామచంద్రపై బాధితులు వీడియోలో ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చిక్కుకున్న కుటుంబాన్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు, ఏజెంట్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) September 8, 2026
మలేషియాలో బందీగా తెలుగు కుటుంబం..
గాజువాకకు చెందిన ఏజెంట్ మోసం చేశారని ఆవేదన..
మలేషియా పంపేందుకు భార్యభర్తల నుంచి రూ. 4 లక్షలు వసూలు చేసిన ఏజెంట్ రామచంద్ర..
మలేషియా నుంచి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధితుల వీడియో..
విజిటింగ్ వీసాపై పంపిన ఏజెంట్.. మలేషియాలో… pic.twitter.com/tJyyDyHhvG








