చెన్నైలో టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి

చెన్నైలో టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి

Summarize with AI

చెన్నైలో(Chennai) తమిళగ వెట్రి కళగం (టీవీకే)(TVK) నేత కన్నన్‌ (Kannan) దారుణ హత్య (Brutal Murder) కలకలం రేపుతోంది. వాంతురై(Vanthurai) ప్రాంతంలో 45 ఏళ్ల కన్నన్‌ను దుండగులు వెంటాడి కొడవళ్లతో(Sickles) విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. గతంలో అన్నాడీఎంకే(AIADMK) 174వ వార్డు కార్యదర్శిగా పనిచేసిన కన్నన్‌ ఇటీవలే టీవీకేలో చేరారు. అయితే ఆయన టీవీకేలో చేరడమే హత్యకు కారణమని ఇప్పటివరకు పోలీసులు నిర్ధారించలేదు. కన్నన్‌పై గతంలో హత్య, హత్యాయత్నం సహా పలు క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనను దుండగులు వెంబడించి దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

కన్నన్‌ హత్య వెనుక పాత కక్షలే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 2009లో జరిగిన శివ (Siva) హత్య కేసుకు సంబంధించిన పాత వివాదాలపై ఆరా తీస్తున్నారు. అలాగే కన్నన్‌ నిర్వహిస్తున్న కార్ల అద్దె వ్యాపారానికి సంబంధించిన గొడవలు, ఇతర వ్యక్తిగత వివాదాలను కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికి పాత కక్షలు, కన్నన్‌ క్రిమినల్‌ నేపథ్యమే హత్యకు ప్రధాన కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ శాంతిభద్రతలపై అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్న సమయంలోనే ఈ హత్య జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై (Law and Order Situation) మరోసారి చర్చ మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment